మ‌ళ్లీ మీడియాపై విరుచుకుప‌డ్డ ట్రంప్‌

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ మీడియాపై ఫైర‌య్యారు. త‌మ ప్ర‌భుత్వ ప‌రిపాల‌నా నిర్వ‌హ‌ణ‌లో ఎటువంటి ఆందోళ‌న లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం ఓ మేలైన మెషీన్‌లా న‌డుస్తోంద‌న్నారు. కార్మిక శాఖ మంత్రిగా అలెగ్జాండ‌ర్ అకోస్టాను నామినేట్ చేసిన ట్రంప్ ఆ సంద‌ర్భంగా వైట్‌హౌజ్‌లో మీడియాతో స‌మావేశం అయ్యారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌ష్యాతో సంబంధాలు కొన‌సాగించిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. నెల రోజుల త‌న ప్ర‌భుత్వ పాల‌న‌ను ట్రంప్ స‌మ‌ర్థించుకున్నారు. మీడియా వ్య‌వ‌హార‌శైలి స‌రిగా లేద‌ని, ఇంత‌టి నిజాయితీ లేని మీడియాను ఎప్పుడూ చూడ‌లేద‌ని, మ‌రీ ముఖ్యంగా పొలిటిక‌ల్ మీడియా చాలా దిగ‌జారిపోయింద‌ని విమ‌ర్శించారు. బాధ్య‌త‌ల‌న్నీ నెత్తిమీద వేసుకున్నాన‌ని కూడా అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. 

Sort by Date | Votes

1 answer

ఇది అతను ఆ చేయడం ఇష్టపడ్డారు తెలుస్తోంది.

Written Feb 20, 2017